యాడికి: మండలంలోని చందన గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మర ఆంజనేయులు, అనిత దంపతుల కుమార్తె నైనిక (6) అధిక గుండెపోటుతో మృతి చెందింది. రాయలచెరువులోని ఓ ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న నైనిక వేసవి సెలవులు కావడంబతో బుధవారం 11 గంటల సమయంలో గ్రామ సమీపంలో ఆడుకుంటూ ఉన్నఫళంగా కుప్పకూలిపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే రాయలచెరువులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అధిక గుండెపోటు కారణంగా చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.


