ఇంగ్లిష్‌ పరీక్షకు 329 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ పరీక్షకు 329 మంది గైర్హాజరు

Feb 27 2026 4:27 AM | Updated on Feb 27 2026 4:27 AM

ఇంగ్లిష్‌ పరీక్షకు  329 మంది గైర్హాజరు

ఇంగ్లిష్‌ పరీక్షకు 329 మంది గైర్హాజరు

పుట్టపర్తి: ఇంటర్‌ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 42 కేంద్రాల్లో

గురువారం ఇంటర్‌ ద్వితీయ జనరల్‌/ఒకేషనల్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ పేపర్‌–2 పరీక్ష నిర్వహించారు. 10,317 మంది జనరల్‌ విద్యార్థులకు గాను 10,051 మంది హాజరు కాగా, 266 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి (డీఐఈఓ) చెన్న కేశవ ప్రసాద్‌ తెలిపారు. ఇక ఒకేషనల్‌కు సంబంధించి 1,326 మందికి గాను 1,263 మంది మాత్రమే హాజరుకాగా, 63 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. ఇంగ్లిష్‌ పేపర్‌–2కు మొత్తంగా 329 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కేంద్రంలోనూ సౌకర్యాలు కల్పించామని డీఐఈఓ తెలిపారు.

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంతి నిలయం: జిల్లాలోని మహాత్మా జ్యోతిభా పూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలల్లో (2026–27 విద్యా సంవత్సరం) వివిధ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌ జమునా భాయి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 840 పాఠశాల సీట్లు, 680 ఇంటర్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే రొద్దం–1 గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో మూడు, 7వ తరగతిలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులు మార్చి 4వ తేదీలోపు https:// mjpapbcwreis. apcfss. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 12వ తేదీన, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి ఏప్రిల్‌ 19వ తేదీ (మధ్యాహ్నం), జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 19న (ఉదయం) ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9440111302 నంబరులో సంప్రదించాలని సూచించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై ‘కూటమి’ రౌడీల దాడి

నేలకోట తండాలో ఘటన

ధర్మవరం: వైఎస్సార్‌సీపీ కార్యకర్త ప్రశాంత్‌ నాయక్‌పై టీడీపీ, బీజేపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన గురువారం రాత్రి ఽమండల పరిధిలోని నేలకోట తాండలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..నేలకోట తండా పంచాయతీ వైస్‌ సర్పంచ్‌ శాంతాభాయి కుమారుడు ప్రశాంత్‌ నాయక్‌... గ్రామంలో వైఎస్సార్‌సీపీ తరఫున చురుకుగా ఉండేవాడు. పార్టీ కార్యక్రమాల్లోనూ అందరినీ భాగస్వామ్యం చేసేవాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ, బీజేపీ నాయకులు అతనిపై కక్ష పెంచుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదును కోసం వేచి చూస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న ప్రశాంత్‌ నాయక్‌ను బీజేపీ, టీడీపీ నాయకులు రవినాయక్‌, నందానాయక్‌, శివానాయక్‌, బుజ్జి నాయక్‌ అడ్డగించి తండాలోని బెల్ట్‌షాప్‌ వద్దకు తీసుకువెళ్లి అక్కడ మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్ది చితకబాదారు. ఈ దాడిలో ప్రశాంత్‌ నాయక్‌ కంటికి తీవ్ర గాయమైంది. స్థానికుల సాయంతో అక్కడి నుంచి తప్పించుకున్న ప్రశాంత్‌ నాయక్‌ ఘటనపై ధర్మవరం రూరల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement