పురంలో డ్రోన్ల నిఘా
హిందూపురం: స్థానిక పలు ముఖ్య ప్రాంతాలు, కాలనీల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా పటిష్ట నిఘా చర్యలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యకలాపాలు, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులుంటే వెంటనే గుర్తించేలా ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
బెంగళూరులో
మడకశిర వాసి మృతి
మడకశిర: బెంగళూరులోని ఎన్జీఓ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న మడకశిర నివాసి హనుమంతరాయప్ప(45) గురువారం మృతి చెందాడు. ఈ మేరకు మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ గురువారం వెల్లడించారు. భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే బెంగళూరులోని కాటన్ పేట పోలీసులను (70190 51435) సంప్రదించాలన్నారు.
అతిగా మద్యం సేవించి చేనేత కార్మికుడి మృతి
పెనుకొండ(సోమందేపల్లి): అతిగా మద్యం సేవించి ఓ చేనేత కార్మికుడు మృతిచెందాడు. సోమందేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు... వినాయకనగర్‌లో నివాసముంటున్న ఖలీల్ (35) మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం వారపు సంత కావడంతో యజమాని బట్వాడా చెల్లించాడు. ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి ఎక్కువ మోతాదులో మద్యం తాగి వాల్మీకి సర్కిల్‌లో అపస్మారకంగా పడిపోయాడు. గమనించిన స్థానికులు పైకి లేపేందుకు ప్రయత్నించారు. చలనం లేకపోవడంతో చనిపోయినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలస్వామి డిమాండ్ చేసారు.
యువకుడి హత్య
విడపనకల్లు: కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు విడపనకల్లు మండలం డొన్నేకల్లు గ్రామ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కడి ఆనవాళ్లను బట్టి బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. గురువారం మధ్య రాత్రి ఘటన జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతదేహానికి సమీపంలోనే కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఓ స్కూటీ పడి ఉండడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు హతుడిని బళ్లారి జిల్లా సింధనూరు గ్రామానికి చెందిన కిరణ్‌కుమార్ (38)గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పురంలో డ్రోన్ల నిఘా
పురంలో డ్రోన్ల నిఘా
పురంలో డ్రోన్ల నిఘా


