2 నుంచి గ్రాండ్‌ టెస్ట్‌, ఎస్‌ఏ–2 | - | Sakshi
Sakshi News home page

2 నుంచి గ్రాండ్‌ టెస్ట్‌, ఎస్‌ఏ–2

Feb 27 2026 4:27 AM | Updated on Feb 27 2026 4:27 AM

2 నుంచి గ్రాండ్‌ టెస్ట్‌, ఎస్‌ఏ–2

2 నుంచి గ్రాండ్‌ టెస్ట్‌, ఎస్‌ఏ–2

అనంతపురం ఎడ్యుకేషన్‌: వచ్చే నెల 2 నుంచి పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్‌ పరీక్షలు, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలును గురువారం డీఈఓ ప్రసాద్‌బాబు, జిల్లా సాధారణ పరీక్షల మండలి కార్యదర్శి గంధం శ్రీనివాసులు వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు రోజూ మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు 1.30 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఇప్పటికే ప్రశ్నపత్రాలు అన్ని మండలాల ఎమ్మార్సీలకు చేరవేసి, అక్కడ భద్రపరిచారు. ప్రశ్నపత్రాల స్టోరేజీ, పాఠశాలలకు తరలింపునకు ఎంఈఓ–1, 2, పాఠశాల కాంప్లెక్స్‌ హెచ్‌ఎంతో కలిపి కమిటీలను ఏర్పాటు చేయాలని డీఈఓ ఆదేశించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు మాత్రమే ప్రశ్నపత్రాలను సంబంధిత పాఠశాలలకు అందజేస్తారు.

పరీక్షల షెడ్యూలు ఇలా.. : 2న తెలుగు, 4న ద్వితీయభాష హిందీ, 5న ఇంగ్లిష్‌, 6న గణితం, 7న భౌతికశాస్త్రం, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం, 11న కాంపోజిట్‌ కోర్సు, 12న సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌, ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement