సాయి నామం.. ఆత్మస్థైర్యం
ప్రశాంతినిలయం: సాయినామస్మరణే తమకు అంతులేని ఆత్మస్థైర్యాన్నిస్తుందంటూ విద్యార్థులు నాటిక రూపంలో వివరించారు. సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనంలో భాగంగా మహిళా క్యాంపస్ విద్యార్థులు నిర్వహించిన వాయిద్య కచేరీ అలరించింది. మంగళవారం సాయంత్రం అనంతపురానికి చెందిన సత్యసాయి మహిళా క్యాంపస్ విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. క్రీడా సమ్మేళనంలో తాము ఆత్మస్థైర్యంతో ప్రదర్శించిన క్రీడా విన్యాసాల తీరును ‘కాన్ఫిడెన్స్ ది గ్రౌండ్ రియాలిటీ’ పేరుతో వివరించారు. క్రీడా విన్యాసాల సమయంలో సత్యసాయి బోధనలు, సూచనలను ఏవిధంగా పాటించామో తెలియజేశారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు.
సాయి నామం.. ఆత్మస్థైర్యం


