పంతులమ్మ హెప్జిబాగ్రేట్‌ | - | Sakshi
Sakshi News home page

పంతులమ్మ హెప్జిబాగ్రేట్‌

Jan 14 2026 7:12 AM | Updated on Jan 14 2026 7:12 AM

పంతుల

పంతులమ్మ హెప్జిబాగ్రేట్‌

పరిగి: మండలంలోని మోదా జెడ్పీహెచ్‌ఎస్‌లో హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హెప్జిబా గ్రేస్‌ పుట్టింది.. పెరిగింది గుంతకల్లులో తండ్రి ఏసుదాసు రైల్వే ఉద్యోగిగా పనిచేశారు. తల్లి కనకమ్మ గృహిణి. డిగ్రీ వరకూ గుంతకల్లులోనే చదువుకున్న ఆమె అనంతరం ఎంఏ హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని విశాఖాలోని థియయోలాజికల్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. పిల్లల్లో హిందీ బాషపై ఆసక్తి పెంచేలా టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ (టీఎల్‌ఎం)ను సొంతంగా తయారు చేసి విద్యాబోధన సాగిస్తుడడంతో ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటూ బెస్ట్‌ టీచర్‌గా పలు అవార్డులు సొంతమయ్యాయి.

ఈ ఏడాది దక్కిన సావిత్రీబాయి పురస్కారం

సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఈ నెల 3న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో బోడే రామచంద్రయాదవ్‌ చేతుల మీదుగా సావిత్రీబాయి దక్షిణ భారత ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. టీఎల్‌ఎంలతో విద్యాబోధన చేయడంతో పాటు విద్యార్థుల్లోని సృజనను వెలికి తీయడం, భాషపై ఆసక్తి పెంచడం, విలువల ఆధారిత విద్యనందించినందుకు గాను ఈ అవార్డు ఆమెకు దక్కింది.

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సొంతం

హెప్జిబా గ్రేస్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులోనూ చోటు దక్కించుకున్నారు. విద్యాబోధనలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆమె మ్యూజికల్‌ కీబోర్డుపై పాఠ్యాంశాలను వినిపిస్తూ విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యాల అభివృద్ధికి చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో 2024 డిసెంబర్‌ 1న విజయవాడలోని హాల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీల్లో గంట వ్యవధిలో కీ బోర్డ్‌ను ప్లే చేస్తూ తీసిన వీడియోను అప్లోడ్‌ చేయడంతో ఈ అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు. కేవలం ఓ ఉపాధ్యాయురాలిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ హెప్జిబా గ్రేస్‌ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. పర్యావరణ ఆవశ్యకతపై విద్యార్థులను చైతన్య పరచడంతో పాఉట మొక్కలు నాటించడం, పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టడం, బాల్య వివాహాలపై అవగాహన కల్పించడం, ఆడపిల్లల పట్ల మెలగాల్సిన ప్రవర్తన, ఆడపిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంచడం, బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.

టీఎల్‌ఎంలతో వినూత్నంగా విద్యాబోధన

బెస్ట్‌ టీచర్‌గా అనేక అవార్డులు

తాజాగా సావిత్రిబాయి పూలే అవార్డు కై వసం

పాఠ్యాంశాల బోధనలో ఒక్కో టీచర్‌ శైలి ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఆ శైలినే ఓ పంతులమ్మకు అవార్డుల వర్షం కురిపిస్తోంది. లెక్కకు మించి అవార్డులతో పాటు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డును సొంతం చేసుకున్న ఆమె తాజాగా సావిత్రీబాయి పూలే అవార్డునూ కై వసం చేసుకుంది. వృత్తి పట్ల తనకున్న ఇష్టంతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న పంతులమ్మ హెప్జిబా...

నిజంగా చాలా గ్రేట్‌ అంటూ

పలువురు అభినందిస్తున్నారు.

ఇప్పటి వరకూ సాధించిన అవార్డులు

2023లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు

2023 అక్టోబర్‌ 2న ఇంటర్నేషనల్‌ స్టార్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు అవార్డు

2024 ఫిబ్రవరి 20న ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు అవార్డు

2024 మే 24న ఐసీడబ్ల్యూఆర్‌ గోల్డెన్‌ ఐకాన్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డు

2024లో ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ అవార్డు

2025 ఏప్రిల్‌ 14న గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు అవార్డు

ఈ నెల 3న సావిత్రీబాయి పూలే అవార్డు

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే..

సమాజానికి ఉత్తమ పౌరులను అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నా. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు చదువుతో పాటు సమాజ స్థితిగతులపై అవగాహన కల్పిస్తున్నాను. ఇప్పటి వరకూ వచ్చిన అవార్డులు, రివార్డులు నా బాధ్యతను మరింత పెంచాయి. – హెప్జిబాగ్రేస్‌

పంతులమ్మ హెప్జిబాగ్రేట్‌1
1/2

పంతులమ్మ హెప్జిబాగ్రేట్‌

పంతులమ్మ హెప్జిబాగ్రేట్‌2
2/2

పంతులమ్మ హెప్జిబాగ్రేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement