ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
ప్రశాంతినిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 256 అర్జీలు అందగా... వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. అర్జీలన్నీ గడువులోపు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ అర్జీలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు.
పింఛన్ మంజూరు చేయండి
నరాల బలహీనతతో చాలా కాలంగా నేను మంచానికే పరిమితమయ్యాను. 92 శాతం వైకల్యం ఉన్నట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు. ఎలాంటి పని చేయడానికి వీలులేక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. నా కుటుంబంపై దయచూపి నాకు వికలాంగ పింఛన్ మంజూరు చేయించి ఆదుకోండి. – బొంతల వెంకటేషు,
లింగారెడ్డిపల్లి, బత్తలపల్లి మండలం
ధ్రువీకరణ పత్రం ఇప్పించండి
మేము ఉపాధి కోసం కుటుంబంతో సహా కేరళకు వెళ్తుంటాం. మేము తండాలో స్థిర నివాసం లేమని ఇప్పటికే అధికారులు చేసిన సర్వేలోనూ తేలింది. దీన్ని ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్ మంజూరు చేయించండి. దీనివల్ల వలస కూలీలమైన మా కుటుంబానికి మేలు జరుగుతుంది. – కేషూబాయి,
నీరాలవంక తండా, నల్లమాడ మండలం
ఎన్నిసార్లు తిరిగినా కాలేదు
నాకు గ్రామంలోని సర్వే నంబర్ 102–1లో పొలం ఉంది. కానీ అధికారులు ఆన్‌లైన్‌లో 102–1–ఏ1 గా నమోదు చేశారు. ఆ నంబర్‌ను సరిదిద్దాలని ఎన్నిసార్లు మండల కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. నా సమస్య నేటికీ తీరలేదు. దయచేసి ఇప్పటికై నా నా భూ సమస్యను పరిష్కరించాలి. – భాగ్యమ్మ,
బసవనపల్లి గ్రామం, అమరాపురం మండలం
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి


