సన్మార్గదర్శి సత్యసాయి
ప్రశాంతి నిలయం: మానవాళికి మంచిని బోధించి సన్మార్గం వైపు నడిపిన మహనీయుడు సత్యసాయి అన్న సందేశాన్ని ఇస్తూ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన భక్తులను మైమరపించింది. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ‘సన్మార్గ దర్శి.. సత్ చక్రవర్తి’ పేరుతో నాటిక ప్రదర్శించారు. ఆధునిక యువతలోని లోపాలను వాటి పరిష్కార మార్గంగా సత్యసాయి బోధనలను వివరిస్తూ గొప్ప సందేశం ఇచ్చారు. యువత సాయి బోధనల ద్వారా పటిష్ట నాయకత్వాన్ని పొంది ఉత్తమ పౌరులుగా తమను తాము ఏవిధంగా తీర్చిదిద్దుకోవచ్చో నాటిక ద్వారా వివరించారు. అనంతరం పాత్రధారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
సన్మార్గదర్శి సత్యసాయి


