చోరీ కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు
పుట్టపర్తి టౌన్: మామిళ్లకుంట క్రాస్ వద్ద ఆరేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలకు నాలుగేళ్ల జైలు శిక్ష రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ పుట్టపర్తి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే... కొత్తచెరువు మండలం మామిళ్లకుంట క్రాస్‌లో నివాసం ఉంటున్న శివయ్య 2019 ఫిబ్రవరి 17వ తేదీన ఇంటికి తాళం వేసి బెంగళూరులో ఉంటున్న తన కూతురును చూసేందుకు వెళ్లాడు. ఇది గమనించిన దొంగలు తాళం పగలగొట్టి మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చి చూసుకున్న శివయ్య ఘటనపై కొత్తచెరువు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లికి చెందిన భీమినేని అమరనాఽథ్, అనంతపురం జిల్లా మన్నీల గ్రామానికి చెందిన కరుణాకర్ నాయుడు దొంగతనం చేసినట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వారి నుంచి సొమ్మును రికవరీ చేశారు. ఈ కేసు సోమవారం పుట్టపర్తి జ్యుడీషియల్ ఫ్లస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు రాగా... సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి... ఇద్దరు ముద్దాయిలకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయిలకు శిక్షపడేలా చేసిన సీఐ మారుతీశంకర్, కోర్టు కానిస్టేబుల్ చంద్రానాయక్‌తోపాటు సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
చోరీ కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు
చోరీ కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు


