బెల్టు దుకాణాలను అరికట్టండి
హిందూపురం టౌన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బెల్టు షాపులను అరికట్టాలని సంబంధిత అధికారులను ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేవించారు. సోమవారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌ను అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు తదితర అంశాలపై సీఐ లక్ష్మీదుర్గయ్యతో ఆరా తీశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. మద్యం అక్రమ రవాణా కేసులలో పట్టుబడిన వాహనాలు త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. కల్లు దుకాణల నుంచి శాంపిల్స్ సేకరించి చిత్తూరులోని ల్యాబ్‌కు పంపించాలన్నారు. కల్తీ కల్లు అరికట్టేలా అమ్మకందారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, కల్తీ కల్లు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, కర్ణాటక మద్యం అక్రమ రవాణాదారుల మీద కేసులు నమోదు చేసి, పాత నేరస్తులు, అనుమానితులను బైండోవర్ చేయాలని, రెండు అంతకుమించి కేసులు ఒక వ్యక్తి మీద నమోదైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఎక్కువ కేసులు కలిగిన వారిని జిల్లా నుంచి బహిష్కరణకు సిఫారసు చేయాలని సూచించారు. అనంతరం మిథనాల్ యూనిట్లతో పాటు తూముకుంట చెక్ పోస్ట్‌ను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 2025లో నాటుసారాకు సంబంధించి 455 కేసులు నమోదు చేసి, 2,332 లీటర్ల నాటుసారా సీజ్ చేసినట్లు వివరించారు. 47,360 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. కర్ణాటక మద్యానికి సంబందించి 1,253 కేసులు నమోదు చేసి, 1,284 మందిని అరెస్ట్ చేసి, 7,421 లీటర్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అనుమతులు లేకుండా కల్లు విక్రయాలు, కల్తీకల్లుకు సంబంధించి 1,886 కేసులు, కల్తీ కల్లుపై 4 కేసులు, కల్తీ కల్లు అమ్మిన 17 కల్లు దుకాణాల అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు. బెల్టు దుకాణాల నిర్వహణకకు సంబంధించి 1,.194 కేసులు నమోదు చేసి, 1,198 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య


