అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికై న అభ్యర్థులూ ఈ నెల19న హాజరు
పుట్టపర్తి టౌన్: వివిధ ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేసి ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక తుది జాబితా వెల్లడైంది. ఎంపికై న అభ్యర్థులు మూడు ఫొటోలతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 19న కర్నూలులోని జోనల్ శిక్షణా కళాశాలకు ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లో 57, 56, 32, 24, 60, 58, 4, 39, 42, 66, 45, 79, 49, 1, 33, 25, 10, 62, 84, 53, 52, 31 సీరియల్ నంబర్లు ఉన్నవారు అర్హులు. అలాగే డ్రాఫ్ట్‌మెన్ (సివిల్) విభాగంలో 7 సీరియల్ నంబర్ ఉన్నవారు హాజరు కావాలి.
పీఆర్‌టీయూ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
పుట్టపర్తి టౌన్: స్థానిక ఎమ్మార్సీలో పీఆర్‌టీయూ క్యాలెండర్, డైరీని డీఈఓ క్రిష్టప్ప సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, రామిరెడ్డి, పుల్లారెడ్డి, మురళీమోహన్, శివకుమార్‌రెడ్డి, చంద్రమోహన్, నాగభూషణం, సతీష్, సంజీవరెడ్డి, గౌతమ్, వెంకట్, సాయినాథరెడ్డి, శివారెడ్డి, నారాయణస్వామి, ఎంఈఓలు ఖాదర్‌వలి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


