పరిష్కార వేదికకు 70 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. జిల్లా అదనపు ఎస్పీ అంకితా సురానా స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు.
సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, డీటీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంతరెడ్డి, ఎస్‌బీ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


