కష్టపడే వారందరికీ గుర్తింపు
రానున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. మన జగనన్న మరోసారి సీఎం కావడం ఖాయం. అప్పటి వరకు పార్టీ బాధ్యతను ప్రతి ఒక్కరూ భుజాన వేసుకుని మోయాలి. కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుంది. కార్యకర్తల శ్రమ వృథా కాదు. జిల్లా స్థాయి నుంచి గ్రామ/వార్డు స్థాయి వరకు కమిటీలన్నీ త్వరలోనే పూర్తి చేస్తాం. జగనన్న 2.0 కోసం కష్టపడే వారందరికీ కమిటీల్లో చోటు ఉంటుంది. కూటమి పార్టీల కుట్రలకు ఎవరూ బెదరొద్దు. – కేవీ ఉషశ్రీచరణ్,
వైఎస్సార్ సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు


