పోరాట యోధుడు వడ్డె ఓబన్న
న్యూస్‌రీల్
పుట్టపర్తి టౌన్: వడ్డె ఓబన్న పోరాట యోధుడని వైఎస్సార్‌సీపీ రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కొనియాడారు. ఆదివారం వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద మిథున్ రెడ్డి ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్డె ఓబన్న ఓ కులానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అలుపెరగకుండా పోరాడి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన త్యాగం భావితరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, శంకర నారాయణ, పార్టీ సమన్వయకర్తలు దీపిక, మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
ప్రశాంతినిలయం: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు ఆదివారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జేసీ మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి తదితరులు వడ్డె ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ వడ్డె ఓబన్న దేశభక్తి భావితరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్రరెడ్డి తదితరులున్నారు.
పోరాట యోధుడు వడ్డె ఓబన్న


