రెచ్చిపోయిన బీజేపీ నాయకులు
ధర్మవరం: బీజేపీ నాయకులు రెచ్చిపోయారు. పూటుగా మద్యం సేవించి వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి చేశారు. పట్టణంలోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఆదివారం ఉదయం టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ చికెన్ సెంటర్ వద్ద చికెన్ కొనేందుకు వైఎస్సార్‌సీపీ నాయకుడు రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి వెళ్లాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో అక్కడకు చేరుకున్న బీజేపీ నాయకులు కాటమయ్య, డేరంగుల నారాయణస్వామిలు రాజశేఖర్ రెడ్డితో గొడవకు దిగారు. సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు పెడుతున్న అసభ్యకర పోస్టులను ఖండిస్తావా అంటూ దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దారు. స్థానికులు వారి నుంచి రాజశేఖర్‌రెడ్డిని విడిపించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ విషయంపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు.
పూటుగా మద్యం సేవించి
వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి


