12 నుంచి అండర్ –12 మండల క్రికెట్ టోర్నీ
ఖాద్రీశా కరుణించు
కదిరి టౌన్: ఓం నమో నారసింహ నామస్మరణతో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రతిధ్వనించింది. స్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్త జనంతో శనివారం ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో ఖాద్రీశుని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యం పొందారు. భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేసి అన్నదానం చేశారు.
అనంతపురం కార్పొరేషన్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు అండర్ –12 మండల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, గుత్తి, తాడిపత్రి, ఆత్మకూరు, హిందూపురం, ధర్మవరంలో 30 జట్లు బరిలో దిగనున్నాయని, 25 ఓవర్ల మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
12 నుంచి అండర్ –12 మండల క్రికెట్ టోర్నీ


