జాతిపిత మూలాలను చెరిపే కుట్ర
హిందూపురం టౌన్: జాతిపిత మహాత్మా గాంధీ మూలాలను చెరిపేసే కుట్ర సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు షానవాజ్ విమర్శించారు. శనివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజల మద్దతుతో తిప్పికొడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు సమద్ షాహీన్, శ్యాంకిరణ్, జమీల్, కలీం, సమీవుల్లా, హనుమంతరాయప్ప, షఫీ, యూనిస్, జియా, ఫయాజ్, అసద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు షానవాజ్


