ఫైనల్ దశకు ఫుట్‌బాల్ టోర్నీ
అనంతపురం కార్పొరేషన్: అనంత స్పోర్ట్స్ అకాడమీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఇన్‌స్పైర్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ దశకు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ తొలి మ్యాచ్‌లో నర్మదా వాలీ జట్టు 9–0 గోల్స్ తేడాతో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీపై, రెండో సెమీఫైనల్‌లో మగన్ సింగ్ రాజీవ్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో పుదువాయ్ యూనికార్న్స్ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాయి.
జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
బత్తలపల్లి: మండలంలోని రామాపురం గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ఎస్.ఇబ్రహీం, ఎస్.జస్విత జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం వెల్లడించారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు తమిళనాడులోని ఈరోడ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించే జట్టులో పాల్గొంటారని వివరించారు. ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు అభినందించారు.
పట్టు గూళ్ల మార్కెట్‌లో ఈ–వేలం అమలు చేయాలి
హిందూపురం: స్థానిక పట్టు గూళ్ల మార్కెట్‌లో ఈ–వేలం ప్రక్రియను వెంటనే చేపట్టాలంటూ పట్టు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్ రాజు, మార్కెట్‌ఽ అధికారి హంపయ్యను శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని అందించి, మాట్లాడారు. ప్రతి రోజూరెండు విడతలుగా పట్టు గూళ్ల ఈ – వేలం నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకూ రైతులు విక్రయించిన తర్వాత పేమెంట్ పట్టీల్లో ఒక లాట్‌కు రూ.30 చొప్పున పట్టుకుని చెల్లిస్తున్నారని, అయితే దీనిని ఆన్‌లైన్ విధానంలో జమ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పశుగ్రాసం దగ్ధం
రొద్దం: పొలంలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తగిలి పశుగ్రాసం దగ్ధమైంది. రొద్దం మండలం ఆర్.మరువపల్లి సమీపాన శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు వరి గడ్డి కొనుగోలు ట్రాక్టర్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల కూలీలు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ట్రాలీని పెకెత్తి గడ్డిని కిందకు పడేశాడు.
ఫైనల్ దశకు ఫుట్‌బాల్ టోర్నీ
ఫైనల్ దశకు ఫుట్‌బాల్ టోర్నీ
ఫైనల్ దశకు ఫుట్‌బాల్ టోర్నీ


