అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా..
ఓడీచెరువు (అమడగూరు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలను మత్తులో ముంచేస్తోంది. ఎక్కడికక్కడ లీజును దక్కించుకున్న టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం దుకాణాల నిర్వహణలో నిబంధనలకు తిలోదాకాలిచ్చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ఎకై ్సజ్ అధికారులు కాస్త చోద్యం చూస్తుండడంతో మద్యం అక్రమ వ్యాపారం ఊపందుకుంది.
అక్రమార్కులకు రాజకీయ రక్షణ..
టెండర్ల ద్వారా మండల కేంద్రానికి ఒకటి చొప్పున మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో అమడగూరు మండలంలో మద్యం దుకాణం నిర్వహణ లీజును దక్కించుకున్న స్థానిక టీడీపీ నేత.. నిబంధనలు తుంగలో తొక్కి ఏకంగా రెండు దుకాణాలు ఏర్పాటు చేశాడు. ఇందులో అమడగూరులో ఉన్న ఒక్క దుకాణానికే ప్రభుత్వ అనుమతి ఉంది. మహమ్మదాబాద్ పబ్లిక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుకాణానికి అనుమతులు లేవు. లీజు దక్కించుకున్న సదరు నేత మరో ముగ్గురు భాగస్వాములుగా కలుపుకుని రాజకీయ రక్షణతో అక్రమ దందాకు తెరలేపడం గమనార్హం. లాభాలు రావడం లేదనే నెపంతో ఎకై ్సజ్ అధికారులను లోబర్చుకుని అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమ దందాకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. వీటికి తోడు అమడగూరు మండలంలోని ప్రతి పల్లెలోనూ బెల్ట్ షాపులను టీడీపీ నేతలు నిర్వహిస్తున్నారు. అప్పటికై నా అధికారులు స్పందించి మద్యం అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అడ్డగోలుగా మద్యం దుకాణాల నిర్వహణ
పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ అధికారులు
అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా..


