బెదిరింపులకు తలొగ్గం
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి రౌడీషీట్లు తెరుస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదని ప్రభుత్వాన్ని ఐక్య విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం పుట్టపర్తిలోని గణేష్ కూడలిలో విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్టనైజింగ్ కార్యదర్శి సంతోష్, వైఎస్సార్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషం మహేంద్ర మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశించిన విద్యార్థి సంఘం నాయకులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికారి ప్రతినిధి అమరనాథ్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజేంద్ర, పుట్టపర్తి నియోజవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అజయ్ భార్గవరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకాల రాజ, నాయకులు విజయకుమార్, అనిల్‌కుమార్, కమల్‌బాషా, నూర్‌మహమ్మద్, ఇబ్రహీం, జిలాన్, నాగేంద్ర, పవన్‌కుమార్‌రెడ్డి, అరుణ్ అదితరులు పాల్గొన్నారు.
ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు


