విద్యా ప్రమాణాలు మెరుగు పడాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గిరిజన సంక్షేమ వసతి పాఠశాలలు, మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సంక్షేమ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సంక్షేమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై గురువారం సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు. విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజన నాణ్యత, బోధన, భద్రత, పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాలికల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, ఏపీసీ దేవరాజు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్‌రెడ్డి, ఎంఈఓలు, వసతి గృహాల సిబ్బంది పాల్గొన్నారు.


