నల్లచెరువు వాసికి రూ.2 కోట్ల వార్షిక వేతనం
కదిరి టౌన్: నల్లచెరువు మండలం మారిశెట్టిపల్లిలో పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించే రాధా, రమణ దంపతుల కుమారుడు ఎం.సాయిమురళి అమెరికాలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన సాయి మురళి 1 నుంచి 8 వరకు హైదరాబాదులోని కేంద్రీయ విద్యాలయంలో, 9, 10 తరగతులు బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయంలో చదివాడు. ఇంటర్మీడియట్ తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేశాడు. తమిళనాడులోని కలసలింగం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివాడు. అమెరికాలోని స్టోనీ బ్రూక్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎంఎస్ చదివాడు. అక్కడే రూ.2 కోట్ల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగానికి ఎంపికై .. ఈ నెల ఐదో తేదీన విధుల్లో చేరాడు.


