సౌత్‌జోన్ హాకీ జట్టులో మంగళకర విద్యార్థి
పుట్టపర్తి అర్బన్: తమిళనాడులోని చైన్నైలో ఉన్న సత్యభామా యూనివర్సిటీ వేదికగా ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఎస్కేయూ జట్టులో పుట్టపర్తి మండలం జగరాజుపల్లి మంగళకర బీకాం మూడో సంవత్సర విద్యార్థి మహేష్‌కు చోటు దక్కింది. ఈ మేరకు మంగళకర మేనేజింగ్ ట్రస్టీ సురేష్ గురువారం వెల్లడించారు. ప్రతిభ చాటిన మహేష్‌ను అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఆర్యా ప్రకాష్, ఏఓ జయచంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌బాబు, పీడీ శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పీఏబీఆర్‌లో
నిలకడగా నీటి నిల్వ
కూడేరు: మండలంలోని పెన్నహోబిల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో సమంగా ఉండడంతో నీటి నిల్వ నిలకడగా ఉంది. గురువారం నాటికి జలాశయంలో 5.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ ద్వారా 306 క్యూసెక్కులు, హంద్రీ నీవా ద్వారా 224 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోంది. ధర్మవరం కుడికాలువకు 380 క్యూసెక్కులు, తాగునీటి ప్రాజెక్టులకు, నీటి ఆవిరి, లీకేజీ రూపంలో మరో 160 క్యూసెక్కుల నీరు బయటకు వెళుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ఉల్లి పంటపై విష ప్రయోగం
చిలమత్తూరు: మండలంలోని చాగలేరు పంచాయతీ మరువపల్లి గ్రామంలో ఉల్లి పంటపై దుండగులు విషప్రయోగం చేశారు. గ్రామానికి చెందిన రైతు శ్రీరామప్ప తనకున్న మూడు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాడు. మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇలాంటి తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో పంట మొత్తం వాడిపోయింది. దీంతో రూ.2.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న సీపీఎం నేతలు వెంకటేష్, రామచంద్ర, తదితరులు కాలిపోయిన పంటను పరిశీలించారు. పంటపై విషప్రయోగం చేసిన వారిని గుర్తించి, బాధిత రైతుకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థి అదృశ్యంపై
కేసు నమోదు
ధర్మవరం అర్బన్: స్థానిక శివానగర్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి హర్షవర్దన్‌రెడ్డి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. ఈనెల 4న మధ్యాహ్నం కదిరి గేట్ వద్ద ఉన్న వారి చికెన్ సెంటర్‌లో పనిచేసే ఇర్ఫాన్‌తో హోటల్‌కెళ్లి భోజనం చేసి వస్తానని చెప్పి హర్షవర్దన్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలుడి తల్లి శివరత్నమ్మ ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లునట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96830 (డీఎస్పీ), 94407 96831 (సీఐ), 79892 79912, 78939 27761 (బాలుడి బంధువులు) కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఊరేగింపుగా రిమాండ్‌కు!
కదిరి టౌన్: తనకల్లు పోలీస్‌స్టేషన్ గేటు ఎదుట మార్పూరివాండ్లపల్లికి చెందిన ఈశ్వరయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో అరైస్టెన నిందితులను గురువారం కదిరి ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి సబ్ జైలు వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతకు ముందు నిందితులు ఎర్రి హరి, చిన్నప్ప, గంగులప్ప, శంకర్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించాల్సి ఉండడంతో వారిని కదిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి సబ్ జైలు వరకూ నడిపించుకుంటూ వెళ్లి, జైలు అధికారికి అప్పగించారు.
సౌత్‌జోన్ హాకీ జట్టులో మంగళకర విద్యార్థి
సౌత్‌జోన్ హాకీ జట్టులో మంగళకర విద్యార్థి
సౌత్‌జోన్ హాకీ జట్టులో మంగళకర విద్యార్థి


