విద్యుదాఘాతంతో రైతు మృతి
● అప్పటికే కరెంట్ షాక్‌తో మృతి చెందిన ఆవు
● ఆవుకు ఏమైందోనని ఆత్రుతతో వెళ్లి ముట్టుకున్న వైనం
● ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి
శింగనమల: మండలంలోని కల్లుమడి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై రైతు పట్రా నరేష్ (38) మృతి చెందాడు. వ్యవసాయంతో పాటు పాడిపోషణతో జీవనం సాగిస్తున్న ఆయన గురువారం తెల్లవారుజామున పశువుల షెడ్డును శుభ్రం చేసేందుకు వెళ్లాడు. అప్పటికే షెడ్డులో కిందకు వేలాడుతున్న కరెంట్ తీగ తగిలి ఓ ఆవు మృతి చెంది ఉంది. అయితే విద్యుత్ షాక్‌తో ఆవు మృతి చెందిన విషయం తెలియని పట్రా నరేష్ ఆత్రుతతో ఆవుకు ఏమైందోనని వెళ్లి ముట్టుకున్నాడు. దీంతో షాక్‌కు గురై గట్టిగా కేక వేసి కుప్పకూలాడు. అరుపు విన్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని అపస్మారకంగా పడి ఉన్న నరేష్‌ను వెంటనే పామిడిలోనీ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రైతు నరేష్‌కు భార్య ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ చితంబరయ్య తెలిపారు.
మాతాశిశు మరణాలను అరికట్టాలి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టాలని సంబంధిత అధికారులను డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మధు సూదన్ సూచించారు. గత ఏడాది డిసెంబర్‌లో జిల్లాలో చోటు చేసుకున్న ఓ మాతృ, మరో 7 శిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులతో గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వారు సమీక్షించారు. మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండడంతో ఇకపై ఒక్క మరణం కూడా సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గర్భస్థ సమయం నుంచి కాన్పు జరిగే వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సురేష్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, డాక్టర్ సునీల్‌కుమార్, డీపీహెచ్‌ఎన్ వీరమ్మ, చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ ముసిరా బేగం, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ సులోచన, ఐసీడీఎస్ సీడీపీఓలు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి


