సాయికాళేశ్వర్ ఆశయ సాధనే లక్ష్యం
పెనుకొండ: సాయికాళేశ్వర్ ఆశయ సాధనే షిర్డీ సాయి గ్లోబల్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ అధినేత శిల్పా అనుపాటి పేర్కొన్నారు. పెనుకొండలోని శివసాయి మందిరంలో గురువారం సాయికాళేశ్వర్ 53వ జయంతి సందర్భంగా శిల్పా అనుపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సాయికాళేశ్వర్ ఘాట్ వద్ద శిల్ప, ఆమె కుమార్తె నవ్యశ్రీ, కుటుంబసభ్యులు మదన్‌మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి, ఆశ్రమ సిబ్బంది చిట్టిబాబు, హరి, బాబు, ప్రగతి శ్రీనివాసులు, న్యాయవాది గురుప్రసాద్, జాన్‌ప్రియనాథ్, విదేశీ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పేదలకు ఉచిత కంటి, చెవి, నరాల జబ్బులకు సంబంధించి ప్రత్యేక వైద్యశిబిరాన్ని విదేశీ భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా అనుపాటి మాట్లాడారు. సాయి కాళేశ్వర్ సేవలను కొనియాడారు. ఆయన చూపిన బాటలోనే తాము కూడా నడుస్తూ వేలాది మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇది నిరవధిక ప్రక్రియగా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని సేవలు విస్తృతం చేస్తామన్నారు. అనంతరం పెనుకొండ మండలం కోనాపురం గ్రామంలో సప్పలమ్మ ఆలయ గోపురం నిర్మాణానికి ట్రస్ట్ తరఫున రూ. 4 లక్షలు విరాళాన్ని అందజేశారు.
శిల్పా అనుపాటి
సాయికాళేశ్వర్ ఆశయ సాధనే లక్ష్యం


