ఆత్మస్థైర్యం ముందు ఏదీ తక్కువ కాదు
హిందూపురం: ఆత్మసైర్యం ముందు ఏ వైకల్యం తక్కువ కాదని, పట్టుదలతో శ్రమిస్తే దేనినైనా సాధించవచ్చునని ఆపరేషన్ సిందూర్‌లో పాలు పంచుకున్న సైనికాధికారి బ్రిగేడియర్ రాజేష్ భాస్కర్ అన్నారు.గురువారం హిందూపురం భవిత కేంద్రంలోని దివ్యాంగ చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా యానకు భవిత కేంద్రంలో చేపట్టిన కార్యక్రమాలను ఎంఈఓ గంగప్ప వివరించారు. పిల్లలు దివ్యాంగులుగా పుట్టారని తల్లిదండ్రులు ఎవరూ బాధపడాల్సిన పనిలేదన్నారు. వారిలో ఆత్మస్థైర్యం నింపి, మేమున్నామని అంటే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని పేర్కొన్నారు. అనంతరం రాజేష్ భాస్కర్‌ను అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో భవిత కేంద్రం స్థల దాత బైసాని రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బ్రిగేడియర్ రాజేష్ భాస్కర్


