రహదారి భద్రతా నియమాలు పాటించాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించి శ్రీసత్యసాయిని ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ పార్థసారథి, ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పుట్టపర్తిలో రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ పార్థసారథి, ఎస్పీ సతీష్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక సత్తెమ్మ గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకూ సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలందరూ బాధ్యతగా నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. రహదారి భద్కతా నియమాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ద్విచక్రవాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి కరుణసాగర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేషులు, సమచార శాఖ ఏడి పురుషోత్తంతోపాటు ఎంవీఐలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్,
ఎంపీ పార్థసారథి,
ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపు


