అబ్బుర పరిచిన ఎన్డీఆర్‌ఎఫ్ విన్యాసాలు
పరిగి: ప్రమాదాలు చోటు చేసుకున్నప్పడు సురక్షితంగా బయటపడే మార్గాలపై మాక్ డ్రిల్‌తో ఎన్డీఆర్‌ఎఫ్ ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. బుధవారం పరిగి మండలం కాలువపల్లిలోని టెక్స్‌పోర్ట్ గార్మెంట్ పరిశ్రమలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు చేపట్టాయి. వివిధ ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు చేపట్టాల్సిన చర్యలను ప్రయోగాత్మకంగా చూపించారు. కార్యక్రమంలో తహసీల్దారు హసీనాసుల్తానా, ఎస్‌ఐ రంగడుయాదవ్, ఎంపీడీఓ రెడ్డెప్ప, ఎన్డీఆర్‌ఎఫ్ డీడీసీ అఖిలేష్, ఇన్‌స్పెక్టర్ హరీష్‌చంద్రపాండే, మునికృష్ణ, సుభాష్‌సింధు, గంగాధర్, ఎంఈఓ శేషాచలం, మెడికల్ ఆఫీసర్ నవీన, ఏఓ శ్రీకృష్ణ, ఏఈలు సునీత, ప్రత్యూష, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లలిత, డిప్యూటీ ఎంపీడీఓ విజయభాస్కర్, టెక్స్‌పోర్ట్ గార్మెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అబ్బుర పరిచిన ఎన్డీఆర్‌ఎఫ్ విన్యాసాలు


