ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ

Jan 7 2026 7:45 AM | Updated on Jan 7 2026 7:45 AM

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ

పుట్టపర్తి: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఒకేషనల్‌, కంప్యూటర్‌ విద్య బోధన ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసే ప్రక్రియ చేపట్టినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ దేవరాజ్‌ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారి నుంచి మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 62 పోస్టులను రిజర్వేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

సీటు కోసం బస్సులో కొట్టుకున్న మహిళలు

ఉరవకొండ: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రాయదుర్గానికి వెళ్లే బస్సులో చోటు చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఉరవకొండ నుంచి కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళుతున్న రాయదుర్గం డిపోకు చెందిన బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళ ప్రయాణికులు మధ్య గొడవ ప్రారంభమైంది. నింబగల్లు సమీపంలో గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. బస్సు డ్రైవర్‌, కండక్టర్‌, తోటి ప్రయాణికులు ఎంతగా వారించినా వినిపించుకోలేదు. డ్రైవర్‌ బస్సును ఉరవకొండ పీఎస్‌కు తీసుకెళ్లి గొడవ పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులకు అప్పగించారు. మహిళలకు ఉరవకొండ సీఐ మహనంది కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement