మాతా శిశు మరణాలు నివారించండి
● జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి సురేష్‌బాబు
నల్లమాడ: మాతా శిశు మరణాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కే.సురేష్‌బాబు సూచించారు. రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే సమావేశంలో ఆయన పాల్గొని ఆరోగ్య, ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చిన్న వయసులోనే బాలికలకు వివాహం చేయడం, పౌష్టికాహార లోపం, చిన్న వయసులోనే గర్భం దాల్చడం, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడంతో పాటు అవగాహనా రాహిత్యంతో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం తదితర కారణాల వల్ల మాతా శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. వాటి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడమే గాక పుట్టిన బిడ్డ మొదటి జన్మదినోత్సవం జరుపుకొనే వరకు అవసరమైన అన్ని వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘దిశ’ సమావేశం
అనంతపురం టవర్‌క్లాక్: శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి ‘దిశ’ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నామని జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ సత్యసాయి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అధికారులు, కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.


