మెడికల్ షాపుల్లో తనిఖీలు
కదిరి టౌన్: స్థానిక 20 మెడికల్ షాపుల్లో అనంతపురం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఓ.వీరకుమార్‌రెడ్డి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు పి.కేశవరెడ్డి, జి.మాధవి, డీఎస్పీ శివనారాయణస్వామి సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మత్తు కలిగించే ఔషధాల విక్రయాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ సక్రమంగా లేని ఐదు దుకాణాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో సీఐలు వి.నారాయణరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఐలు బాబ్జాన్, ధనుంజయరెడ్డి, భువనేశ్వరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పరిష్కార వేదికకు
85 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 85 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆంకిత సురాన మహవీర్, మహిళా పీఎస్ డీఎస్పీ ఇందిర, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అరటి ఎగుమతి సమస్యలపై అధ్యయనం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా నుంచి ముంబయి మీదుగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులకు ఎదురవుతున్న సమస్యలపై ఏపీ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎల్‌ఐడీసీ) అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం అనంతపురంలోని ఉద్యానశాఖ కార్యాలయంలో డీడీహెచ్ డి.ఉమాదేవి, ఏడీహెచ్ దేవానందకుమార్‌తో పాటు ఎక్స్‌పోర్టర్లు, ట్రేడర్లు, ఎఫ్‌పీఓలతో ఏపీఎల్‌ఐడీసీ అధికారులు పవన్‌కుమార్‌సాహు, రామనాథ్‌రెడ్డి సమావేశమై చర్చించారు. రైల్వే సహకారంతో ఏసీ రెఫ్రిజిరేటర్ కంటైనర్ల ద్వారా అరటి ఎగుమతికి ప్రణాళిక ఉన్నా రవాణా ఖర్చులు, ఇతరత్రా అనుమతుల్లో జాప్యం కారణంగా సమస్యలు తలెత్తుతున్నట్లు జిల్లా అధికారులు, ఎగుమతిదారులు తెలిపారు. తాడిపత్రి నుంచి రైలు మార్గం ద్వారా ముంబయికు వెళితే.. అక్కడి నుంచి పోర్టు (నౌకాశ్రయం)లోకి అరటిని చేర్చడానికి సమయం తీసుకుంటున్నారని, అనుమతులు తొందరగా ఇవ్వడం లేదని వివరించారు. కంటైనర్లు కూడా సక్రమంగా అందుబాటులోకి రావడం లేదన్నారు. క్వాలిటీ చెకింగ్, అనుమతులు, క్వారంటైన్ తదితర ప్రక్రియల్లో జాప్యం చోటు చేసుకుంటుండడంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇక్కడే ‘డ్రై పోర్టు’ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో రెండు మూడు చోట్ల కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే రైతులు లేదా కంపెనీలు అరటిని అక్కడికి తీసుకువచ్చి... అక్కడి నుంచి కంటైనర్లకు లోడ్ చేయడం సులభమవుతుందని వివరించారు.
హోరాహోరీగా ఫుట్‌బాల్ పోటీలు
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఇన్‌స్పైర్ ఫుట్‌బాల్ కప్ టోర్నీ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. తొలి మ్యాచ్‌లో మగన్‌సింగ్ రాజీవ్ ఎఫ్‌సీ జట్టు 5–0 గోల్స్ తేడాతో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అలాగే నర్మద వాలీ ఎఫ్‌సీ జట్టు 6–0 గోల్స్ తేడాతో తాండమ్ ఫౌండేషన్ జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. పదువయ్ యూనికార్న్ జట్టు ఏకంగా 18–0 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై విజయఢంకా మోగించింది. ఫజల్ ఎఫ్‌సీ జట్టు 12–0 గోల్స్ తేడాతో నాంది ఫౌండేషన్ జట్టుపై, యువ ఫౌండేషన్ 3–0 గోల్స్ తేడాతో ఆస్కార్ ఫౌండేషన్ జట్టుపై గెలుపొందాయి.
మెడికల్ షాపుల్లో తనిఖీలు
మెడికల్ షాపుల్లో తనిఖీలు
మెడికల్ షాపుల్లో తనిఖీలు


