వీరభద్రుని సేవలో జేసీ దంపతులు
లేపాక్షి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ దంపతులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక తహసీల్దార్ సౌజన్యలక్ష్మి ఉన్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం విశిష్టతను వివరించారు.
ఘనంగా ఏపీహెచ్‌ఎంఏ వేడుకలు
హిందూపురం టౌన్: ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం (ఏపీహెచ్‌ఎంఏ) 75వ వార్షికోత్సవాన్ని ఆదివారం హిందూపురంలోని చిన్మయ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మనోజ్ ఆరాధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందిన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓలు నాగరాజు నాయక్, గంగప్ప, యూనియన్ నాయకులు జయరాం రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఫణి కుమార్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
వీరభద్రుని సేవలో జేసీ దంపతులు


