పామిడి సీహెచ్‌సీలో అరుదైన శస్త్రచికిత్స | - | Sakshi
Sakshi News home page

పామిడి సీహెచ్‌సీలో అరుదైన శస్త్రచికిత్స

Jan 5 2026 7:35 AM | Updated on Jan 5 2026 7:35 AM

పామిడి సీహెచ్‌సీలో  అరుదైన శస్త్రచికిత్స

పామిడి సీహెచ్‌సీలో అరుదైన శస్త్రచికిత్స

పామిడి: స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆదివారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. వివరాలు.. అనంతపురంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన ఉన్నె సులేమా కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స కోసం పామిడి సీహెచ్‌సీ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు ఎడమ అండాశయంలో 7 x 6 సెం.మీ. పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విషయాన్ని వెంటనే ఆమెకు తెలిపి ఆదివారం వైద్యాధికారి శివకార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో జనరల్‌ సర్జన్‌ కమలాధర్‌, అనస్తీషియా నిపుణులు వైఎస్‌ రాఘవేంద్రరెడ్డి, హెడ్‌నర్సు శివకుమారి బృందం శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

కంప్యూటర్‌, స్పోకెన్‌

ఇంగ్లిష్‌పై ఉచిత శిక్షణ

అనంతపురం టౌన్‌: దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ–జీకేవై) కింద గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా కంప్యూటర్‌ విద్య, స్పోకెన్‌ ఇంగ్లిష్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ టి.శైలజ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకూ అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఫొటోలతో అనంతపురంలోని పంగల్‌ రోడ్డులో ఉన్న టీటీడీసీ కార్యాలయంలో జరిగే ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలి. పూర్తి సమాచారానికి 63005 99277 లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement