‘సడ్లపల్లి’ పురస్కారాలకు కథా సంపుటాల ఆహ్వానం
హిందూపురం: స్థానిక టీచర్స్ కాలనీలోని తపన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అందజేస్తున్న సడ్లపల్లి పురస్కారాలకు తెలుగు కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకుడు సడ్లపల్లి చిదంబరరెడ్డి తెలిపారు. ఆదివారం తపన సాహిత్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య ప్రచురించిన తెలుగు కథా సంపుటాల నాలుగు ప్రతులను మార్చి 31లోపు ‘సడ్లపల్లె చిదంబరరెడ్డి, డోర్ నంబర్ 21–6–138, టీచర్స్ కాలనీ, హిందూపురం, సెల్.94400 73636’ కు పంపాలన్నారు. న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన రచయితకు పురస్కారంతో పాటు నగదు ప్రోత్సాహాకాన్ని అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో తపన సాహిత్య వేదిక ప్రతినిధులు ఏటిగడ్డ అశ్వత్థనారాయణ, సిద్ధగిరి శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, యువకవి గంగాధర్ పాల్గొన్నారు.


