రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ పోటీలు ప్రారంభం
హిందూపురం టౌన్: లూయీ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని జిల్లా అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోహిందూపురంలోని ఎంజీఎం పాఠశాల, ఎస్‌డీజీఎస్ కళాశాల మైదానాలు వేదికగా రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాలకు చెందిన 7 జట్లు పాల్గొన్నాయి. పోటీలను మున్సిపల్ చైర్‌పర్సన్ డీఈ రమేష్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో అంధ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రబాబు, జిల్లా సంఘం అధ్యక్షుడు విశ్వనాథనాయుడు, భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున పురస్కార గ్రహీత ఐ.అజయ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


