పశుశాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటు
● అధ్యక్షుడిగా మహేంద్ర, ప్రధాన
కార్యదర్శిగా బాబునాయుడు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక సాయినగర్‌లోని పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి జిల్లా పశుసంవర్ధకశాఖ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆల్ క్యాడర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా బి.మహేంద్ర, ప్రధాన కార్యదర్శిగా ఆర్.బాబునాయుడు, ఉపాధ్యక్షులుగా సి.వరప్రసాద్, ఏఎల్ సురేష్‌బాబు, జాయింట్ సెక్రటరీలుగా ఎం.రామాంజనేయులు, ఎం.ఆదినారాయణ, కోశాధికారిగా టి.విశ్వనాథ్, అలాగే కమిటీ సభ్యులుగా ఎం.నాగపవన్, డి.ఆదినారాయణ, వై.రేవతి, ఎం.నరసింహులు ఎన్నికయ్యారు.
తిమ్మమ్మ మర్రిమానును
సందర్శించిన జడ్జీల బృందం
ఎన్‌పీకుంట: మండలంలోని గూటిబైలు గ్రామంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమానును ఆదివారం వివిధ హోదాల జడ్జీల బృందం కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించింది. వీరిలో ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి బి.సాద్‌బాబు, పోక్సో కోర్జు జడ్జి ఎస్.చినబాబు, పీఆర్‌ఎల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.పద్మ, డీఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి ఎన్.రాజశేఖర్ ఉన్నారు. జడ్జీ కటుంబ సభ్యులకు తిమ్మమాంబ ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి, సత్కరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మర్రిమాను విశిష్టతను, ఆలయ చరిత్రను టూరిజం గైడ్ మనోహర్, అనిల్‌రాయల్ ద్వారా తెలుసుకున్నారు. మర్రిమాను ప్రాంతంలో కలియ తిరిగి చెట్టును, ఊడలను పరిశీలించారు.
వేమన ఆలయాన్ని
సందర్శించిన న్యాయమూర్తులు
గాండ్లపెంట: కటారుపల్లిలోని విశ్వకవి యోగి వేమన ఆలయాన్ని జిల్లా న్యాయమూర్తులు ఆదివారం సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ సెల్ న్యాయమూర్తి సాధుబాబు, పోక్సో కోర్టు న్యాయమూర్తి చినబాబు, అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పద్మ యోగి వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ పీఠాధిపతి నందవేమారెడ్డి న్యాయమూర్తులకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించి, వేమన చరిత్రను తెలియజేశారు.
పశుశాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటు


