పుట్టపర్తి టౌన్: భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 19న పుట్టపర్తికి వస్తున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి తెలిపారు. ప్రధాని పర్యటన బందోబస్తుపై ఆదివారం స్థానిక పోలీస్ కార్యాలయ సమీపంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ఆవరణలో పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. శత జయంతి ఉత్సవాలకు వీఐపీలు, వీవీఐపీలు రానున్న నేపథ్యంలో పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా ఉండాలని డీఐజీ షిమోషి, ఎస్పీ సతీష్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. 22, 23 తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం హాజరవుతారన్నారు. విమానాశ్రయంలో బందోబస్తు, కాన్వాయి వెళ్లే మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్ గురించి మ్యాప్ ఆధారంగా వివరించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి ఎస్‌ఐ ర్యాంక్ అధికారులు ఆయా సెక్టార్ ఇన్‌చార్జ్‌లు అందరూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. వీఐపీల భద్రత పరంగా 340 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో వివిధ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డీఐజీ షిమోషి , హాజరైన పోలీస్ అధికారులు
ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత


