ఓ లక్ష్యం.. మార్చింది జీవన గమనం
నల్లమాడ మండలం వంకరకుంట పంచాయతీలోని మారుమూల గ్రామం సానేవారిపల్లిలో నివాసముంటున్న కె.వెంకట్రాముడు, లక్ష్మీనారాయణ దంపతులు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. వీరి ఏకై క కుమారుడు చెన్నకేశవులు 1నుంచి 5వ తరగతి వరకు సొంతూరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు రెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్‌ను తనకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నాడు. ఎస్కేయూలో డిగ్రీ, ఎస్పీయూ పీజీ పూర్తి చేశాడు. అనంతరం సీఎస్‌ఐఆర్–నెట్ పరీక్షలో ఆలిండియా లెవల్‌లో 94వ ర్యాంకు సాధించి పీహెచ్‌డీ ఫెలోషిప్‌కు అర్హత పొందారు.
వరి పైర్లపై పరిశోధన
పీహెచ్‌డీలో భాగంగా ఒడిశాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో గత ఏడాది వరి పైర్ల వృద్ధి, ఎదుగుదలపై విస్తృత పరిశోధనలు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్టుగా టమాటపై పరిశోధనలు సాగించారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న టమాట ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిశోధన సాగింది. ప్రస్తుతం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్‌ఆర్‌ఎఫ్)లో నేషనల్ డాక్టోరల్ ఫెలోషిప్ కింద తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌కు అర్హత సాధించారు. ఇక్కడ బియ్యం రకాల వృద్ధిపై పరిశోధనలు చేయనున్నట్లు యువ శాస్త్రవేత్త చెన్నకేశవులు వివరించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతులకు ఉపయోగకరమైన పరిశోధనలు సాగిస్తున్నానని, వీటి ఫలితాలను త్వరలో రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు.
రైతులకు సేవలందించే లక్ష్యంతో
ముందుకు సాగుతున్న యువ శాస్త్రవేత్త చెన్నకేశవులు
ప్రభుత్వ పాఠశాలలో చదివి పీహెచ్‌డీ ఫెలోషిప్
ఎవరైనా ఒక స్థాయి వరకు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే చాలనుకుంటారు. అయితే ఒక లక్ష్యంతో ముందుకు సాగే వారు చాలా అరుదుగా ఉంటారు. ఈ రెండో కోవకు చెందిన వారే యువ శాస్త్రవేత్త కుంచపు చెన్నకేశవులు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ రైతు శ్రేయస్సుకు బాటలు వేయాలన్న లక్ష్యంతో శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆయన విజయ ప్రస్తానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – నల్లమాడ:
ఓ లక్ష్యం.. మార్చింది జీవన గమనం


