18 లీటర్ల కల్లు స్వాధీనం
● నలుగురి అరెస్ట్
హిందూపురం టౌన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టి చౌళూరు గ్రామ పరిసరాల్లో అనిల్ అనే వ్యక్తి నుంచి ఏడు లీటర్ల అనుమతి లేని కల్లును స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. అలాగే పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి సమీపంలో నరసింహమూర్తి అనే వ్యక్తి నుంచి 5 లీటర్లు, కోనాపురం సమీపంలో గోవిందప్ప అనే వ్యక్తి నుంచి 6 లీటర్ల అనుమతుల్లేని కల్లు, పాపిరెడ్డిపల్లిలో ఇమాంసాహెబ్ నుంచి 10 మద్యం విస్కీ బాటిళ్లు స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పులమతి కల్లు డిపో, గోళ్లాపురం కల్లు దుకాణం నుంచి నమూనాలను సేకరించి, పరీక్ష నిమిత్తం చిత్తూరులోని ప్రయోగశాలకు పంపినట్లు వివరించారు. కార్యక్రమంలో డీటీఎఫ్ పుట్టపర్తి సీఐ హరికృష్ణ, ఎస్‌ఐలు ఓంసింహ, ఫరూక్, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
నలుగురు మహిళల అరెస్ట్
హిందూపురం: స్థానిక సప్తగిరి కాలేజీ రోడ్డు సమీపంలో నలుగురు మహిళలను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టారు. విచారణ అనంతరం వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
గెలుపు దిశగా ఆంధ్ర జట్టు
● పాండిచ్చేరి రెండో ఇన్నింగ్స్‌లో 37/4
అనంతపురం కార్పొరేషన్: అనంత క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న సీకే నాయుడు ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో గెలుపు దిశగా ఆంధ్ర జట్టు సాగుతోంది. మంగళవారం రాయలసీమ క్రికెట్ గ్రౌండ్‌లో ఓవర్‌నైట్ స్కోర్ 184/3తో బ్యాటింగ్ కొనసాగించిన ఆంధ్ర జట్టు.. రెండో బంతికే కిషన్ యాదవ్ బౌలింగ్‌లో జీఎస్‌పీ తేజ(100) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికి 194 స్కోర్ వద్ద అభినవ్ (48) పెవిలియన్ బాటపట్డాడు. వికెట్ కీపర్ ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ 18 పరుగులు చేసి అవుట్ కావడంతో కేఎస్‌ఎన్ రాజు, ఆకాష్ జత కట్టి నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో రాజు 74 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 55, అకాష్ 35 పరుగులు చేశారు. చివరన ఆదిత్యరెడ్డి 3 బౌండరీలతో 21 పరుగులు సాధించాడు. 341/9 వద్ద ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పాండిచ్చేరి బౌలర్ కిషన్ యాదవ్ 101 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాండిచ్చేరి జట్టు ఆటముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 37 పరుగులు సాధించింది. ఆంధ్ర బౌలర్ కేఎస్‌ఎన్ రాజు అద్భుత బౌలింగ్‌తో పాండిచ్చేరి జట్టును కట్టడి చేశాడు.
రైలు పట్టాలపై తీవ్ర గాయాలతో...
హిందూపురం: రైలు పట్టాలపై తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు గుర్తించి ఆస్పత్రికి చేర్చారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. హిందూపురం–దేవరపల్లి రైలు మార్గంలో 50 ఏళ్ల లోపు వయసున్న గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆచూకీ తెలిసిన వారు 94411 45833కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.


