ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
ముదిగుబ్బ: ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగే స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ముదిగుబ్బ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో యశ్వంత్‌కుమారి, వైష్ణవి, మహిత ఉన్నారు. వీరిని ఆ పాఠశాల హెచ్‌ఎం రమాదేవి, పీడీ రేఖ, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసులు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు అభినందించారు.
ధర్మవరం రూరల్: ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు కాకినాడలో జరిగే ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ధర్మవరం మండలం చిగిచెర్ల విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో యశ్వంత్, విక్రాంత్, అప్జల్ మెహరాజ్, ఈశ్వర్, నందిని, యశ్విత, లాస్యరెడ్డి, యశస్విని ఉన్నారు. ఈ మేరకు ఆ పాఠశాల పీడీ ప్రతాపరెడ్డి మంగళవారం తెలిపారు. అలాగే గొట్లూరులోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు కుమార్, జాకీర్, మహమ్మద్, కె.విజయ్, వ్యూహిత వర్షిణి.. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఎంపికై న విద్యార్థులను ఆ పాఠశాల హెచ్‌ఎం జగన్నాథం, పీడీ రమేష్‌బాబు అభినందించారు.
లేపాక్షి: త్వరలో బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు లేపాక్షిలోని కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న హిమబిందు, వైష్ణవి ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను కేజీబీవీ ఎస్‌ఓ నీలిమా అభినందించారు.
పెనుకొండ రూరల్: త్వరలో శ్రీకాకుళం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో డిస్క్ త్రో విభాగంలో పెనుకొండ మండలం రాంపురం పాఠశాల 8వ తరగతి విద్యార్థి బి.గాయత్రి ఎంపికై ంది. ఈ మేరకు ఆ పాఠశాల హెచ్‌ఎం నాగపద్మజ, పీడీ దివాకర్ యాదవ్ మంగళవారం వెల్లడించారు.
పరిగి: మండలంలోని ధనాపురం జెడ్పీహెచ్‌ఎస్ 9వ తరగతి విద్యార్థిని అవంతి రాష్ట్ర స్థాయి ఆథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై ంది. ఎంపికై న విద్యార్థిని ఆ పాఠశాల హెచ్‌ఎం జ్యోతిర్మయి, పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక


