7 నుంచి దర్గాహొన్నూరు ఉరుసు
బొమ్మనహాళ్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బొమ్మనహాళ్ మండలం దర్గాహోన్నూరులో వెలసిన స్వామి ఉరుసు ఈ నెల 7న ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీ వరకూ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. 7 గంధం, 8న ఒకటవ దీపారాధన, 9న రెండవ దీపారాధన, 10వ తేదీ దేవుడి సవారీ, 11న జియారత్ ఉంటుంది. హిందూ, ముస్లింల ఐఖ్యతకు మారుపేరుగా నిలిచిన దర్గాహోన్నూరు ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో దర్గా వద్ద పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం బళ్లారి, ఉరవకొండ, కణేకల్లు, రాయదుర్గం, అనంతపురం నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని భక్తులు కోరుతున్నారు.
సేవాఘడ్‌లో ఘనంగా
ఆలయ రజతోత్సవాలు
గుత్తి రూరల్: మండలంలోని సేవాఘఢ్‌లో వెలసిన సంత్ సేవాలాల్ మహరాజ్, మాత జగదాంబ ఆలయ రజతోత్సవాలు మంగళవరాం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకుడు ఆసూరి మారుతీప్రసాద్ ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. బుధవారం జగదాంబ ఆలయంలో వేంకటేశ్వర, ఉమామహేశ్వర స్వామి కల్యాణం, అష్టలక్ష్మి యంత్రార్చన, లక్ష దీపోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమంలో సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, సభ్యలు రవీందర్‌నాయక్, వెంకటరమణనాయక్, మీటునాయక్, నారాయణనాయక్, శివనాయక్, నారాయణనాయక్, రామాంజులనాయక్, సుధాకర్‌నాయక్, డాక్టర్.శ్రీరాములునాయక్, మల్లికార్జున, మహారాష్ట్రకు చెందిన మోతీచంద్‌చౌహన్, కర్ణాటకకు చెందిన మహరాజ్ పాల్గొన్నారు.
7 నుంచి దర్గాహొన్నూరు ఉరుసు


