దీప స్తంభంపై శాసనం
పుట్టపర్తి టౌన్: కొతచెరువు మండలం పాత దేవరపల్లి వద్ద ఉన్న చెన్నకేశవస్వామి ఆలయంలో దీప స్తంభంపై సంస్కృతలో లిఖించిన శాసనం తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చరిత్ర పరిశోధకుడు బుక్కపట్నం గోపి ఈ శాసనాలు గుర్తించగా మైనా స్వామి పరిశీలించారు. దీప స్తంభంపై కన్నడ లిపిలో శాసనం ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల కృపతో భూమండలం అభివృద్ధి చెందినట్లుగా అందులో లిఖించారని పేర్కొన్నారు. కనిగిరికి చెందిన జగపతిరాజు చెక్కించినట్లుగా ఉందన్నారు.
నీట మునిగి యువకుడి మృతి
చెన్నేకొత్తపల్లి: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. సీకేపల్లి మండలం దామాజిపల్లికి చెందిన బాబావలి (32), స్థానిక 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ధాబాలో వంట మాస్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య నజ్మున్నా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన బాబావలి చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో ధాబాకు వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. మంగళవారం ఉదయం దామాజిపల్లి సమీపంలోని కల్వర్టు వద్ద నీటిలో తేలియాడుతున్న బాబావలి మృతదేహన్ని అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రమాదవశాత్తు కల్వర్టులో పడి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెంది ఉంటాడని నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పుట్టపర్తిలో
జ్యోతిర్లింగాల ప్రదర్శన
పుట్టపర్తి టౌన్: సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలోని ఆర్‌వీజే కల్యాణ మంటపంలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శనను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 13 నుంచి బాబా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు.
యువకుడి బలవన్మరణం
మడకశిర రూరల్: మండలంలోని కొడిగానిపల్లికి చెందిన చౌడప్ప (28) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. 104 వాహనంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న చౌడప్ప తాగుడుకు అలవాటు పడడంతో ఇటీవల విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన అతను సోమవారం రాత్రి మద్యంలో టపాసుల మందు కలుపుకుని తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఘటనపై తల్లి రంగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
దీప స్తంభంపై శాసనం
దీప స్తంభంపై శాసనం
దీప స్తంభంపై శాసనం


