తనిఖీలు నిర్వహిస్తాం
చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో 2,500 హెక్టార్ల విస్తీర్ణంలో ఎర్రకొండ అటవీప్రాంతం విస్తరించింది. యగ్నిశెట్టిపల్లి, వై.గొల్లపల్లి పరిసరాలు అన్నీ అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. అందమైన పొలాలు, దట్టమైన అడవులు, వన్యప్రాణులతో ప్రకృతి స్వర్గధామంగా ఉంటోంది. అలాంటి ఈ ప్రాంతంలో టీడీపీకి చెందిన గోపీనాథ్ అనే వ్యక్తి తమ పూర్వీకులకు చెందిన శోత్రియం భూములంటూ ఇప్పటికే అక్కడ రైతులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కున్నాడు. అడవిలోని మేత బీడులు, కొండలు, గుట్టలు అన్నీ తనవే అంటూ అప్పట్లో పనిచేసిన తహసీల్దార్ బలరాం ద్వారా 300 ఎకరాల పైచిలుకు భూములు స్వాధీనం చేసుకున్నాడు. బాధిత రైతులు ప్రభుత్వానికి, కోర్టుల దృష్టికి తీసుకువెళితే తహసీల్దార్ బలరాం కోర్టుకు, ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి.. శోత్రియం భూములుగా చిత్రీకరించి కొండలు, గుట్టలకు రైత్వారీ పట్టాలు మంజూరు చేయించారు. అనంతరం వచ్చిన రంగనాయకులు కూడా అదే పని చేశారు. ఇలా అక్రమంగా రైత్వారీ పట్టాలు పొందిన కొండలు, గుట్టలను గోపీనాథ్, ఆయన బంధువులు ఇప్పుడు టీడీపీ నేత గుండమల తిప్పేస్వామికి కట్టబెట్టారు. అక్కడ మైనింగ్– క్రషర్ నిర్వహణ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. కొండల్ని కరిగించేందుకు బ్లాస్టింగ్ చేసి.. తర్వాత హిటాచీల ద్వారా చదును చేస్తున్నారు. ఇందుకోసం మందుగుండు సామగ్రి ఉన్న కంటైనర్‌ను భద్రపరిచారు.
అడవుల్లో వృక్షాలు తొలగించడం తీవ్రమైన నేరం. అటవీ పరిసరాల్లో వృక్షాలు తొలగించాల్సి వచ్చినా ప్రత్యేక అనుమతులు పొందాలి. భారీ వృక్షాలు నేలకూల్చి చదును చేసుకున్నట్టు మా దృష్టిలో ఉంది. తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి
కొండను తవ్వి అక్రమంగా వేసిన రహదారి
లక్షలాది వృక్షాలను తొలగించిన ప్రాంతం ఇదే
అడవి మధ్యలో క్రషర్!
చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్న నిర్వాహకులు
లక్షలాది చెట్లను నరికేసినా
పట్టని అటవీ శాఖ
పర్యావరణానికి ముప్పు
తప్పదంటున్న ప్రజలు
అక్కడ నిషేధమే.. అయినా..!
అటవీ పరిసరాల్లో మైనింగ్ నిషేధం. చుట్టూ అడవి, పచ్చిక బయళ్లు, మేత బీడులు, దట్టమైన వృక్ష సంపదను వశపరుచుకుని మైనింగ్ చేస్తే కఠినంగా శిక్షలు అమలు చేస్తారు. అయినా అటువంటి చట్టాలు ఇక్కడ ‘పచ్చ’ నేతలకు వర్తించవు. దీంతో అడవులను నాశనం చేస్తూ పోతున్నారు. యగ్నిశెట్టిపల్లి పరిసరాల్లోనే శ్రీధరగుట్టలో ఎస్‌ఆర్‌సీ, గుండమల తిప్పేస్వామికి చెందిన జీటీఎస్‌లు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి పెను విధ్వంసమే చేశారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ, మైనింగ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
కాలిబాటే రాచబాటగా...
అటవీ ప్రాంతంలోని కొండల్లో మేత కోసం జీవాలను తీసుకెళ్లేందుకు వీలుగా కాలిబాట ఉండేది. మైనింగ్ ఏర్పాటు కోసం రంగంలోకి దిగిన ‘పచ్చ’ మాఫియా నేరుగా కొండల్ని పిండి చేసి కాలి బాటను రాచబాటగా మార్చుకుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇష్టారీతిన తవ్వకాలు జరిపి రహదారి నిర్మించుకున్నారు. గ్రామస్తులు మెజారిటీ శాతం ఈ క్రషర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. గుండమల వాళ్లు వేసిన రోడ్డుకు ప్రభుత్వం నుంచి బిల్లులు పెట్టించి.. ఆ సొమ్ము స్థానిక టీడీపీ నేతలు, ఎమ్మెల్యే పీఏలకు చేర్చేందుకు ప్రణాళికలు వేశారని తెలుస్తోంది.
తనిఖీలు నిర్వహిస్తాం
తనిఖీలు నిర్వహిస్తాం


