కోటి సంతకాలతో ప్రైవేటీకరణను అడ్డుకుందాం
సోమందేపల్లి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని కోటి సంతకాల సేకరణతో అడ్డుకుందామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. మంగళవారం నాగినాయని చెరువు గ్రామంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య, విద్య రంగానికి పెద్దపీట వేసిందని, అందులో భాగంగానే నాడు–నేడుతో ఆస్పత్రులు, పాఠశాలల రూపురేఖలు మార్చిందని గుర్తు చేశారు. పేదలకు వైద్య విద్య అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అప్పటి మ్యుమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలను మంజూరు చేయించారన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్వార్థం కోసం పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తోందని తెలిపారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు గజేంద్ర, శ్రీనివాసులు, మాజీ కన్వీనర్ నారాయణరెడ్డి, సర్పంచులు అంజినాయక్, పరంధామ, వైస్ సర్పంచ్ వేణు, స్ధానిక నాయకులు శ్రీనివాసులు, అశ్వర్ధప్ప, చెన్నకేశవులు, ఆదినారాయణరెడ్డి, జితేంద్ర, బాబు, నరసింహమూర్తి, మంజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీజీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్


