బాబా ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తిలో ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు 200 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయన పుట్టపర్తిలో పర్యటించారు. సత్యసాయి శతజయంత్యుత్సవాల సఽందర్భంగా ఏర్పాటు చేయనున్న పార్కింగ్ స్థలాలు, బస్టాండ్‌ను సందర్శించి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ తర్వాత డిపో ఆవరణలో ఉద్యోగులు, కార్మికులు గ్యారేజీ సిబ్బందితో సమావేశం నిర్వహించి.. బాబా శత జయంత్యుత్సవాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్‌ను మర్యాద పూర్వకంగా కలసి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రావాణా సౌకర్యం కల్పించాలన్నారు. అందుకు కోసం జిల్లాలు, అంతర్‌జిల్లాల నుంచి సాధారణ చార్జీలతోనే 200 ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు. పట్టణంలో తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేయాలని, భక్తులు ప్రైవేటు వాహనాల దోపిడీకి గురి కాకుండా చూడాలన్నారు. అలాగే పుట్టపర్తి, ధర్మవరం రైల్వేస్టేషన్ల వద్ద తాత్కాలికి ఆర్టీసీ బస్టాండ్‌లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ సంస్థ ఆదాయం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీటీఎం మాధవ త్రిలోక్, కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ప్రజా రావాణాధికారి మధుసూదన్, డిప్యూటీ మెకానికల్ ఇంజినీర్ రమేష్, చీఫ్ సివిల్ ఇంజినీర్ వెంకటరమణ, డిపో మేనేజర్ ఇనయతుల్లా ఎండీ వెంట ఉన్నారు.
తాత్కాలిక బస్‌స్టాండ్ల ఏర్పాటు..
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు


