తల్లిదండ్రులు ఆలోచించాలి | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు ఆలోచించాలి

Apr 18 2025 12:43 AM | Updated on Apr 18 2025 12:43 AM

తల్లి

తల్లిదండ్రులు ఆలోచించాలి

● ఓ యువకుడు.. ఇద్దరు బాలికల వివాహ పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న గోరంట్లలో జరగాల్సిన వివాహం చర్చకు దారి తీయడంతో బాలల సంరక్షణ అధికారులు పరిశీలించారు. సదరు యువతులకు 18 ఏళ్లు నిండకపోవడంతో వివాహాలను అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమని కాదూ కూడదు అని ముందుకెళ్తే కటకటాలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

● ఇంటర్‌ చదువుతోన్న ఓ బాలికను 20 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. పెళ్లి చేసుకునే తమకు రక్షణ కావాలంటూ తొలుత అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అయితే బాలిక వయసు 17 ఏళ్లు కావడంతో కుటుంబ సభ్యులను పిలిచారు. అప్పటికే యువకుడు పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు కేసు వద్దని చెప్పడంతో ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి పంపించారు. ఈ ఘటన పుట్టపర్తిలో వెలుగు చూసింది.

● గోరంట్లకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకుని పరారై వచ్చారు. బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించగా.. కొన్ని నెలల తర్వాత ధర్మవరంలో పట్టుబడ్డారు. అప్పటికే బాలిక గర్భం దాల్చింది. పైగా 18 ఏళ్లు దాటి పది రోజులు పూర్తి కావడంతో ఇరు కుటుంబాలకు సర్దిజెప్పి పంపించారు.

బడికి పోవాల్సిన వయసులోనే కొందరు బాలికలు బాధ్యతలు మోయాల్సి వస్తోంది.

చదువుకోవాల్సిన వయసులోనే గర్భం దాల్చి అనారోగ్యాల బారిన పడుతున్న వారి

సంఖ్య పెరిగిపోతోంది. బాల్య వివాహాలు ఏ రకంగానూ మంచిది కాదని అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు.

చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం నేరం. అమ్మా యిలకు 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలి. అంతకుముందే వివా హం చేయాలని చూస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. చిన్న వయసులో పెళ్లి, గర్భం దాల్చడం బాలికల ఆరోగ్యానికి ప్రమాదకరం. చదివే వయసులోనే ఇంటి బాధ్యతలు మోయాల్సిన అవసరం లేదు. చదివితే ఉన్నత స్థాయికి వెళ్లి మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఆలోచించాలి.

– శ్రీదేవి, ఐసీడీఎస్‌ పీడీ

సాక్షి, పుట్టపర్తి: జీవితమంటే ఏమిటో తెలియని పసి వయసులోనే ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, అంతలోనే గర్భం దాల్చడం వంటి ఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. బాల్య వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు కూడా తెలిసీ తెలియని వయసులోనే జరిగిపోతున్నాయి. అధికారులు అప్రమత్తం కావడంతో గత 12 నెలల వ్యవధిలో 118 బాల్య వివాహాలు ఆగిపోయాయి. జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, గ్రామాల్లో అధికారులు బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

చిన్న వయసులోనే గర్భం..

బాల్య వివాహాల కారణంగా చిన్న వయసులోనే బాలికలు గర్భం దాలుస్తున్నారు. ఫలితంగా శారీరకంగా ఎదుగుదల లోపించడంతో పాటు పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.. గుట్టుగా పిల్లలకు మూడుముళ్ల తంతు సాగిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆడబిడ్డల తల్లిదండ్రులు చిన్న వయసులోనే బాలికలను ఇల్లు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రేమ వ్యవహారాలు కూడా చిన్న వయసులోనే బాలికలను ఇల్లాలిని చేస్తున్నాయి. ప్రేమించిన వారు మోసగించి పరారవుతుండటంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను మోస్తున్నారు.

అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆగని బాల్య వివాహాలు

గుట్టుచప్పుడుకాకుండా

పెళ్లిళ్లు చేస్తున్న వైనం

ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం

గ్రామీణ ప్రాంతాల్లోనే

అధికంగా వెలుగులోకి..

ఏడాదిలో 118 బాల్య వివాహాలకు చెక్‌

తల్లిదండ్రులు ఆలోచించాలి 1
1/3

తల్లిదండ్రులు ఆలోచించాలి

తల్లిదండ్రులు ఆలోచించాలి 2
2/3

తల్లిదండ్రులు ఆలోచించాలి

తల్లిదండ్రులు ఆలోచించాలి 3
3/3

తల్లిదండ్రులు ఆలోచించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement