ధర్మవరం యువకుడికి జాతీయ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ధర్మవరం యువకుడికి జాతీయ పురస్కారం

Apr 16 2025 12:10 AM | Updated on Apr 16 2025 12:10 AM

ధర్మవ

ధర్మవరం యువకుడికి జాతీయ పురస్కారం

ధర్మవరం అర్బన్‌: ధర్మవరం పట్టణానికి చెందిన రజినీ ట్రస్ట్‌, రక్తబంధం ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు కన్న వెంకటేష్‌కు జాతీయ ఉత్తమ సేవారత్న పురస్కారం దక్కింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా విజయవాడలోని సిద్దార్థ కాలేజ్‌ ఆడిటోరియంలో జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల్లో నిస్వార్థంగా సమాజానికి సేవలు అందిస్తున్న సేవకులను గుర్తించి అవార్డులను అందించారు. ఇందులో కన్న వెంకటేష్‌ ఉన్నారు. విజయవాడ ఎమ్మెల్యే సుజనాచౌదరి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు చేతులమీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు.

17న విద్యా వైజ్ఞానిక యాత్ర

పుట్టపర్తి అర్బన్‌: విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17న చేపట్టిన విద్యా వైజ్ఞానిక యాత్రలో పాల్గొని శాసీ్త్రయ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని డీఈఓ కృష్ణప్ప పిలుపునిచ్చారు. యాత్రకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం తన కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది రామకృష్ణ, లాజరు, ఉపాధ్యాయులు ఇర్షాద్‌, వలి, సురేష్‌, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపికై న 120 మంది విద్యార్థులతో కలిసి ఈ నెల 16వ తేదీ రాత్రి మడకశిర, ధర్మవరం, కదిరి నుంచి ప్రత్యేక బస్‌లతో ఉపాధ్యాయులు బయలుదేరుతారన్నారు.17న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, కుప్పంలోని అగస్త్య ఫౌండేషన్‌ను సందర్శిస్తారన్నారు. విద్యార్థులు సమరూప దుస్తులు ధరించి రావాలన్నారు. అలాగే తల్లిదండ్రుల అంగీకార పత్రం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. బాలికలు మహిళా ఉపాధ్యాయుల సంరక్షణలో, బాలురు పురుష ఉపాధ్యాయుల సంరక్షణలో ఉంటారన్నారు.

కళ్లలో కారం చల్లి.. రాళ్లతో దాడి

ధర్మవరం అర్బన్‌: ద్విచక్ర వాహనం రుణం కంతులు సక్రమంగా కట్టాలని హితవు పలికినందుకు సొంత బావ, అక్క కారం పొడి చల్లి రాళ్లతో దాడి చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మరంలోని కేతిరెడ్డి కాలనీ ఎల్‌2కు చెందిన దాసరి సురేష్‌ తన భార్య పేరుపై ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్‌ కింద తీసి బావమరిది రామాంజనేయులు ఇచ్చాడు. అయితే రుణం కంతులు సక్రమంగా కట్టకపోవడంతో ఆ భారం సురేష్‌పై పడుతూ వచ్చింది. దీంతో సోమవారం రాత్రి రామాంజనేయులును సురేష్‌, ఆయన భార్య నిలదీశారు. దీంతో రామాంజనేయులు, ఆయన భార్య ఉష నేరుగా సురేష్‌ ఇంటి వద్దకెళ్లి గొడవపడ్డారు. కళ్లలో కారం పొడి చల్లి, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఫెయిల్‌ భయం..

విద్యార్థిని బలవన్మరణం

ధర్మవరం రూరల్‌: మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన సాకే కృష్ణయ్య కుమార్తె వైష్ణవి (15) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివిన వైష్ణవి ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి చేరుకుంది. అయితే పరీక్షలు తాను సక్రమంగా రాయలేదని, ఫెయిల్‌ అవుతాననే భావనతో మానసికంగా కుదేలైంది. ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని సర్దిచెప్పారు. ఫెయిల్‌ అయినా పర్వాలేదులే అంటూ ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన వైష్ణవి... మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పు కొక్కికి తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పనిపై బయటకు వెళ్లిన తల్లిదండ్రులు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి స్థానికుల సాయంతో ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు నిర్దారించారు. ఘటనపై రూరల్‌ పీఎస్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.

ధర్మవరం యువకుడికి జాతీయ పురస్కారం 1
1/2

ధర్మవరం యువకుడికి జాతీయ పురస్కారం

ధర్మవరం యువకుడికి జాతీయ పురస్కారం 2
2/2

ధర్మవరం యువకుడికి జాతీయ పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement