హోరాహోరీగా రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు
ధర్మవరం: స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ పోటీలు రెండో రోజు సోమవారం హోరాహోరీగా సాగాయి. ప్రకాశం జిల్లా జట్టుపై అనంతపురం జిల్లా జట్టు 3–1 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఏలూరు జట్టుపై విశాఖ జట్టు 8–1, గుంటూరు జట్టుపై అన్నమయ్య జిల్లా జట్టు 6–1, ఎన్టీఆర్ జిల్లా జట్టుపై వైఎస్సార్ జిల్లా జట్టు 7–0, ఏలూరు జట్టుపై శ్రీకాకుళం జట్టు 2–0, చిత్తూరు జిల్లా జట్టుపై కాకినాడ జట్టు 6–0, నంద్యాల జిల్లా జట్టుపై అనంతపురం జిల్లా జట్టు 5–0 గోల్స్ తేడాతో గెలుపొందాయి. తిరుపతి – అనకాపల్లి, అన్నమయ్య– శ్రీకాకుళం, కాకినాడ – అనంతపురం, వైఎస్సార్ – శ్రీసత్యసాయి జిల్లా జట్ల మధ్య మంగళవారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పోటీలను హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణుక్యరాజు, ట్రెజరర్ థామస్ పీటర్, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, కోచ్ హసేన్ పర్యవేక్షించారు.


