మధురం.. ప్రేమ రామం
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తెలంగాణ సత్యసాయి యూత్ బృందం సభ్యులు సోమవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరం వేదికగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. సత్యసాయి తన భక్తులపై చూపిన ప్రేమ, వాత్సల్యాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన భక్తపరివారంపై చూపిన ప్రేమ వాత్సల్యంతో పోల్చుతూ ప్రేమ రామం పేరుతో ప్రదర్శించిన నృత్యరూపకం భక్తులను మైమరిపించింది. రామకథ రసవాహిని పేరుతో సత్యసాయి రాసిన రామగ్రంథం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నృత్యరూపకాన్ని రూపొందించడం విశేషం. అంతకు ముందు ఉదయం శ్రీ సాయి రామ నామామృతం పేరుతో సంగీత కచేరీతో అలరించారు.
మధురం.. ప్రేమ రామం


