పండుగకు నోచని ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

పండుగకు నోచని ఉపాధ్యాయులు

Apr 7 2025 10:20 AM | Updated on Apr 7 2025 10:20 AM

పండుగ

పండుగకు నోచని ఉపాధ్యాయులు

పుట్టపర్తి: శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా రామాలయాలు దర్శించుకుని పండుగ చేసుకున్నారు. అయితే ఉపాధ్యాయులకు ఆ అవకాశం లేకుండా పోయింది. కొత్తచెరువులోని బాల, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పదో తరగతి పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌కు దాదాపు 800 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. పండుగకు కూడా సెలవు ఇవ్వకుండా స్పాట్‌ వాల్యుయేషన్‌ విధులు అప్పగించడంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

నేడు ప్రజా సమస్యల

పరిష్కార వేదిక

ప్రశాంతి నిలయం: కలెక్టర్‌ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కల్టెక్టర్‌ చేతన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

నేడు పోలీస్‌ కార్యాలయంలో...

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

క్రీడలతో అంతర్జాతీయస్థాయి గుర్తింపు

ధర్మవరం: చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం ఊకా అశ్వత్థనారాయణ మెమోరియల్‌ 15వ హాకీ ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ మెన్‌ ఇంటర్‌ డిస్ట్రిక్‌ హాకీ చాంపియన్‌షిప్‌ పోటీలను మంత్రి ప్రారంభించారు. నాలుగు రోజులపాటు సాగే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి 22 జట్లకు చెందిన 440 మంది క్రీడాకారులు వచ్చారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్మవరంలో టర్ఫ్‌ హాకీ కోర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తొలిరోజు విజేతలు..

చిత్తూరుతో జరిగిన హాకీ మ్యాచ్‌లో 10 గోల్స్‌తో కాకినాడ విజయం సాధించింది. ఇక నంద్యాల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రకాశం జట్టు ఐదు గోల్స్‌తో గెలుపొందింది. ఇక విశాఖపట్నంతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాకుళం జట్టు 3.2 గోల్స్‌తో విజయం సాధించింది. మన్యం జట్టుపై అన్నమయ్య జట్టు 5 గోల్స్‌తో గెలుపొందింది. నెల్లూరు జట్టుపై 5 గోల్స్‌తో తిరుపతి జట్టు విజేతగా నిలిచింది. వెస్ట్‌ గోదావరి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2 గోల్స్‌తో అనకాలపల్లి జట్టు విజయం సాధించింది. కర్నూలు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 12 గోల్స్‌తో కడప విజేతగా నిలిచింది. కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చాణక్యరాజు, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్‌, కార్యదర్శి హర్షవర్ధన్‌, కోశాధికారి థామస్‌, సౌత్‌ రైల్వే ఆఫీసర్‌ కత్తి గీతారెడ్డి, ఆర్డీఓ మహే ష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, జనసేనపార్టీ ఇన్‌చార్జ్‌ చిలకం మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

కూడేరు: ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు... జయపురానికి చెందిన మదన్‌మోహన్‌, సునీత దంపతులకు కుమార్తె అర్చన (16), ఓ కుమారుడు ఉన్నారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న అర్చన ఇటీవల మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి చేరుకుంది. పరీక్షలు సక్రమంగా రాయలేకపోయానని, ఫెయిల్‌ అవుతానంటూ తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన అర్చన... ఆదివారం వేకువజామున ఇంట్లోనే బాత్రూమ్‌లో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

పండుగకు నోచని ఉపాధ్యాయులు 1
1/2

పండుగకు నోచని ఉపాధ్యాయులు

పండుగకు నోచని ఉపాధ్యాయులు 2
2/2

పండుగకు నోచని ఉపాధ్యాయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement